News April 7, 2024

ప.గో.: ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ విజయం.. ఈ సారి..?

image

చింతలపూడిలో రాజకీయం ఆసక్తిగా మారింది. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ MLA ఎలీజాను కాదని కొత్తఅభ్యర్థి కంభం విజయరాజుకు ఆ పార్టీ అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. కూటమి నుంచి సైతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని కాదని కొత్త అభ్యర్థి సొంగా రోషన్‌ను ప్రకటించింది. అయితే నియోజకవర్గ ఓటర్లు 2009, 14, 19 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలకు అధికారం కట్టబెడుతూ వచ్చారు. మరి ఈ సారి ఎవరికి అవకాశమిస్తారో చూడాలి.

Similar News

News October 26, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO

image

మెంథా తుపాను ప్రభావంతో ఈ నెల 27, 28న భారీ వర్షాలు, బలమైన గాలులు సంభవించనున్నట్టు నరసాపురం RDO దాసి రాజు శనివారం సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. అవసరమైతే తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నద్ధం చేస్తున్నామన్నారు. సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

News October 25, 2025

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు: కలెక్టర్

image

జిల్లా అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని, 24/7 అధికారులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో రెవిన్యూ డివిజనల్ అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. తుపాన్ ప్రభావంపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.

News October 25, 2025

కోపల్లెలో విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి

image

విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి చెందిన ఘటన కాళ్ల మండలం కోపల్లెలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కె.షాలేంరాజు(15) స్నేహితులతో కలిసి బ్యానర్ కడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఫ్రేమ్ విద్యుత్ తీగలకు తగిలి మృతి చెందాడు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన వార్త విని హుటాహుటిన కోపల్లె బయలుదేరి వస్తున్నట్లు సమాచారం.