News December 19, 2025
ప.గో: కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల వివరాలు పరిశీలన

ఉమ్మడి ప.గో జిల్లాకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు 193 మంది డిసెంబర్ 20న ఉదయం 9 గంటలకు శిక్షణకు వెళ్లేందుకు లగేజితో హాజరుకావాలని ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాల్ని అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు శుక్రవారం పరిశీలించారు. పురుష అభ్యర్థులను అనంతపురం , మహిళా అభ్యర్థులను విజయనగరం పంపుతామన్నారు.
Similar News
News December 19, 2025
TooMuch Centralisation అవుతోందా..?

UGC, AICTE, NCTEల స్థానంలో పార్లమెంటులో కేంద్రం బిల్లు పెట్టిన వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్(VBSA) నియంతృత్వానికి మార్గం అవుతుందని ప్రతిపక్షాల ఆరోపణ. స్టేట్స్ రైట్స్, ప్రాంతీయ విద్య ప్రాధాన్యతలకు ముప్పు కల్గుతుందని ఆందోళన వెలిబుచ్చాయి. అటు ఫండ్స్ జారీ పవర్ కేంద్ర విద్యాశాఖ వద్ద ఉంచుకోవడంతో రాజకీయ కారణాలతో నిధులు ఆపే ఛాన్సుందనేది మరో అనుమానం. ఈ తరుణంలో VBSAపై JPC 2 నెలల్లో ఏ రిపోర్టు ఇస్తుందో?
News December 19, 2025
CNAP సర్వీస్ లాంచ్ చేసిన జియో

CNAP (కాలర్ నేమ్ ప్రజెంటేషన్) సర్వీస్‌ను జియో స్టార్ట్ చేసింది. కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా మొబైల్ స్క్రీన్‌పై సిమ్ కార్డుతో రిజిస్టర్ అయిన వ్యక్తి పేరు కనిపిస్తుంది. సిమ్ కొనుగోలు చేసే సమయంలో ఇచ్చిన కేవైసీ డాక్యుమెంట్‌లో ఉన్న పేరు కనిపించేలా రూపొందించింది. స్పామ్, మోసపూరిత, డిజిటల్ స్కామ్‌లను నియంత్రణకు ఉపయోగపడే ఈ సర్వీస్ ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
News December 19, 2025
TU: సౌత్ క్యాంపస్‌ను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్

భిక్కనూరు మండల పరిధిలోని టీయూ సౌత్ క్యాంపస్‌ను శుక్రవారం జిల్లా డిజిగ్నేటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డా.శిరీష తనిఖీ చేశారు. బాలుర వసతి గృహాన్ని సందర్శించి, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు. నాణ్యమైన భోజనాలను మోతాదుకు అనుగుణంగా ఉపయోగించాలన్నారు. నాణ్యమైన సరుకులు వాడాలని, ఆహారం కలుషితం కాకుండా జాగ్రత్త పడాలని వార్డెన్ డా.యాలాద్రికి సూచించారు. క్యాంపస్‌లో పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.


