News December 28, 2024

ప.గో: గన్ మిస్ ఫైర్..రిటైర్డ్ ఉద్యోగికి గాయాలు

image

సర్వీసు గన్ మిస్ ఫైర్ అయిన ఘటనలో రిటైర్డ్ మిలిటరీ ఉద్యోగి స్వల్ప గాయాల పాలయ్యాడు. నిడదవోలు మండలం కాటకోటేశ్వరంకు చెందిన మిలిటరీ ఉద్యోగి కారింకి శ్రీనివాస్ తన గన్‌ను ప్రతి 6 నెలలకోసారి నిడదవోలు సీఐ కార్యాలయంలో తనిఖీ చేయిస్తుంటారు. గురువారం నిడదవోలు పోలీస్ కార్యాలయానికి తన గన్‌ను చెక్ చేయించడానికి తీసుకువచ్చి స్టేషన్ బయట కూర్చుని గన్ శుభ్రం చేస్తుండగా ట్రిగ్గర్ వేలికి తగిలి మిస్ ఫైర్ అయ్యింది.

Similar News

News December 29, 2024

కొల్లేరుపై నిర్వహించిన లిడార్ సర్వేపై ఏలూరు కలెక్టర్ సమీక్ష

image

కొల్లేరుపై 2022-23లో నిర్వహించిన లిడార్ సర్వే పూర్తవడంతో దానిపై శనివారం శాఖల అధికారులతో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి సమీక్ష నిర్వహించారు. గ్రౌండ్ ట్రూ థింగ్ కోసం అటవీ శాఖ అధికారులు ప్రతిపాదించిన అంశాలపై చర్చించారు. శాస్త్రీయబద్ధంగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, లిడార్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులు, అటవీ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News December 28, 2024

పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలి: కలెక్టర్

image

జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలను అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం భీమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నందు కలెక్టర్ అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు& ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఉన్న 47 పరిశ్రమలకు స్టాటిటరీ నోటీసులు ఇచ్చి, వాటికి సంబంధించిన రిపోర్టులను అందించాలన్నారు.

News December 28, 2024

ఏలూరు జిల్లాలో ఒకరోజు ముందే రూ.113.01కోట్లు పంపిణీ

image

డిసెంబర్ 31న జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లాలో 2,62,228 మంది పెన్షన్‌దారులకు రూ.113.01 కోట్లు పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. పెన్షన్ పంపిణీపై అధికారులతో శనివారం సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న పెన్షన్ చెల్లింపులు జనవరి 1న ఆంగ్ల సంవత్సరాది కావడంతో ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.