News December 23, 2025
ప.గో: గుడ్ న్యూస్ చెప్పిన జేసీ

జిల్లాలో యూరియా కొరత లేదని రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో తెలిపారు. జిల్లాలో రబీ పంటకు, అన్ని పంటలకు అవసరమైన 36,820 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువుల పంపిణీకి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అన్నారు. అక్టోబర్ 1 నాటికి 7,009 మెట్రిక్ టన్నుల యూరియా ప్రారంభ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Similar News
News February 16, 2026
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి: SP

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో SP అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా 15 అర్జీలను స్వీకరించారు. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూవివాదాలు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను SP ఆదేశించారు.
News February 16, 2026
నరసాపురం: గల్ఫ్ వెళ్లిన మహిళ మృతి.. కానిస్టేబుల్‌పై కేసు

గల్ఫ్ పంపించి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులపై ఆదివారం నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్టవరంకి చెందిన మురాల రాజమణి(48) డిసెంబర్ 4, 2025న గల్ఫ్‌లో మృతి చెందింది. రాజమణిని ఉండికి చెందిన భీమవరం ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అలుగు యేసేబు, బింకం విమలు గల్ఫ్ పంపారు. అక్కడ అనారోగ్యానికి గురైన తన తల్లికి వైద్య సదుపాయాలు కల్పించలేదని కుమార్తె ఉషా పోలీసులుకు ఫిర్యాదు చేసింది.
News February 16, 2026
ప్రశాంతంగా శివరాత్రి ఉత్సవాలు: కలెక్టర్

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ శివరాత్రి మహోత్సవాలు ప్రశాంతంగా జరిగాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 క్షేత్రాలలో సోమేశ్వర స్వామి దేవాలయం, క్షీర రామలింగేశ్వర స్వామి 2 పంచారామ క్షేత్రాలు మన జిల్లాలోనే ఉండడం ఎంతో విశేషం అన్నారు. శైవక్షేత్రాలను సుమారు 3 లక్షల 50 వేల మంది పైగా భక్తులు దర్శించుకోవడం జరిగిందన్నారు.


