News November 13, 2024

ప.గో: గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ

image

57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లో ఈ నెల 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాలకు సంబంధించి గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. జిల్లా కేంద్ర గ్రంధాలయం సంస్థ కార్యదర్శి యం.శేఖర్ బాబు ఈ నెల 14వ తేదీన బాలల దినోత్సవంతో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.

Similar News

News December 18, 2024

అత్తిలిలో CRPF ASIకి అంత్యక్రియలు

image

న్యూఢిల్లీ నోయిడాలో సీఆర్‌పీఎఫ్‌ 100వ బెటాలియన్‌ ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌లో ASIగా పని చేస్తున్న అత్తిలి గ్రామానికి చెందిన నేలపాటి జ్యోతికుమారి (56) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. ఢిల్లీ నుంచి విమానంలో ఆమె మృతదేహాన్ని గన్నవరం ఎయిర్‌పోర్టుకు సోమవారం ఉదయానికి చేరుకుంది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సైనిక వందనం చేసి ప్రభుత్వ లాంఛనాలతో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.

News December 18, 2024

అధికారులను అప్రమత్తం చేశాం: జేసీ

image

ఉండి మండలం ఎండగండి గ్రామ రైతులతో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ముఖాముఖి నిర్వహించారు. ధాన్యం రవాణాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా, గోనె సంచులు రైతు సేవాకేంద్రంలో అందిస్తున్నారా, అనే అంశాలపై రైతుల నుంచి ఆరా తీశారు. జిల్లాలో 80 శాతం వరి కోతలు ముగిశాయని, అటు వర్షాల హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తామన్నారు.

News December 17, 2024

భీమవరం: పోలీసులపై దాడి చేసిన నిందితులు అరెస్టు

image

పోలీసులపై దాడి చేసిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు, డీఎస్పీ రమేశ్ బాబు కథనం మేరకు.. రాజమండ్రిలో శ్రీకాకుళం పోలీసులపై దాడి చేసి.. రాపాక ప్రభాకర్‌‌ను తీసుకువెళ్లిన నిందితులను అరెస్టు చేశామన్నారు. దాడి చేసిన వారిలో భీమవరానికి చెందిన శ్రీకాంత్, వినోద్, రాజు, మహంకాళి, క్రాంతి, మొగల్తూరుకి చెందిన కామరాజుతో పాటు రాజమండ్రికి చెందిన మరో ఏడుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.