News March 7, 2026

ప.గో: చంద్రబాబు తప్పిదంతోనే డయాఫ్రం వాల్‌కు నష్టం.. వైసీపీ ట్వీట్

image

పోలవరం స్పిల్‌వే, కాఫర్ డ్యాంలు పూర్తిచేయకుండానే డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించడం వల్లే నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, చంద్రబాబు తప్పిదం వల్లే ఇలా జరిగిందని ‘ఎక్స్’ వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. 2022లో అసెంబ్లీలో వైఎస్ జగన్ ఇదే విషయాన్ని చెప్పారని, అప్పట్లో టీడీపీ నేతలు ఈ వాస్తవాన్ని అంగీకరించలేదని ఆ పార్టీ తాజా ట్వీట్‌లో గుర్తు చేసింది.

Similar News

News April 5, 2026

సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారా? జాగ్రత్త!

image

సెలబ్రిటీలు, మహిళలే లక్ష్యంగా SMలో బూతులు తిట్టేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల రేణూ దేశాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. SMలో ఫేమస్ అవ్వాలని, యూట్యూబ్‌లో వ్యూస్ కోసమే ఇలా చేసినట్లు పలువురు నిందితులు చెప్పడం గమనార్హం. ఇలాంటి చర్యల వల్ల కెరీర్, వ్యక్తిగత జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాక్ స్వాతంత్య్రం హద్దు మీరకూడదంటున్నారు.

News April 5, 2026

వనపర్తి: కరెంట్ షాక్‌తో రైతు మృతి

image

ఏదుల మండలం గుండ్యవాల్య నాయక్ తాండ గ్రామపంచాయతీకి చెందిన కాట్రావత్ లోకేష్ (45) వ్యవసాయ పొలం వద్ద ఈరోజు ఉదయం 6:30కు కరెంట్ షాక్‌తో మరణించారు. వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదానికి గురైనట్లు బీజేపీ నేత తిరుపతి నాయక్ తెలిపారు. ఏడాది క్రితం వరకు ఆయన పోస్ట్ మెన్‌గా పనిచేశారన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 5, 2026

VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

image

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్‌పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.