News November 21, 2024

ప.గో జిల్లాలో దొంగతనాలు..అరెస్ట్ చేస్తారని సూసైడ్

image

అరెస్ట్ భయంతో తిరుపతిలో సూర్యప్రభాశ్(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం జరిగింది. ఇతను ప.గో, ఏలూరులో దొంగతనాలు చేసి కేసులు నమోదవ్వగా తిరుపతికి పారిపోయాడు. లక్కవరం ఎస్సై రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్సై సంపత్ కుమార్ సిబ్బందితో తిరుపతికి వెళ్లారు. పోలీసులను గమనించి అతను గడియ పెట్టుకొని..అరెస్ట్ చేస్తారనే భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. రుయాకు తరలిస్తుండగా మృతి చెందాడు.

Similar News

News January 29, 2025

 భీమవరం: లింగ నిర్ధారణ చేయడం నేరం..డిఆర్ఓ

image

భీమవరం కలెక్టరేట్లో స్థాయి గర్భస్థపూర్వక, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్ష కమిటీ, జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం డీఆర్‌ఓ ఎం. వెంకటేశ్వర్లు ఆధర్వంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో గర్భిణులకు స్కానింగ్ చేసే సమయంలో పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయడం, పరీక్ల చట్టం 1994, రూల్స్ 1996 ప్రకారం జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News January 28, 2025

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ 

image

ఈనెల 31న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుగొండలో పర్యటించనున్నారు. ఏర్పాట్లను  జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జెసి రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పెనుగొండ నగరేశ్వర, మహిషాసురమర్దిని శ్రీ వాసవికన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవస్థానంలో జరిగే  శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. 

News January 28, 2025

భీమవరం వాసికి అరుదైన అవకాశం

image

ప.గో జిల్లా వాసికి అరుదైన అవకాశం లభించింది. భీమవరానికి చెందిన చల్లా ధనంజయ ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా సెలక్టయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆర్డర్స్ ఇచ్చింది. 1983 నుంచి ఆయన లాయర్‌గా పనిచేస్తున్నారు. 1987 వరకు రాజమండ్రిలో వర్క్ చేసిన ఆయన.. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. 2022లో సీనియర్ లాయర్ గుర్తింపు దక్కింది. తాజా పదవి ప్రకారం ఆయన.. ఏపీ హైకోర్టులో కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తారు.