News February 27, 2025

ప.గో జిల్లాలో పోలింగ్ @12 PM

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు సమయానికి 27.28% శాతంగా నమోదైందన్నారు. పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

Similar News

News February 25, 2026

పాలకొల్లు: మేకా శేషుబాబుపై సస్పెన్షన్ ఎత్తివేత

image

మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపై విధించిన సస్పెన్షన్‌ను వైసీపీ అధిష్ఠానం ఎత్తివేసింది. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు మంగళవారం రాత్రి ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఇటీవల వైఎస్ జగన్‌ను కలిసి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన శేషుబాబు, త్వరలోనే రీఎంట్రీ ఇస్తారనే ప్రచారానికి ఈ నిర్ణయంతో బలం చేకూరింది. పార్టీ ప్రకటనతో ఆయన అనుచరులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 25, 2026

ప.గో: నిరుద్యోగ యువతకు GOOD NEWS

image

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.