News March 7, 2025
ప.గో జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప.గో జిల్లా వాసులు ఎక్కువగా ఏలూరు, తూ.గో జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థలతో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా ప.గో జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
Similar News
News December 19, 2025
‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే విజయవంతం చేయాలి: జేసీ

‘సుశాసన్ సప్తాహ్ – ప్రశాసన్ గావ్ కీ ఒరే 2025’ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేసీ రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ నుంచి దేశవ్యాప్త ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌గా వీక్షించారు. ఈ నెల 25 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల ద్వారా గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి, పారదర్శక పాలనకు పెద్దపీట వేయనున్నట్లు జేసీ తెలిపారు.
News December 19, 2025
వీరవాసరం: ప్రజల ముంగిటకే ‘వాట్సాప్’ గవర్నెన్స్

పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో చేపట్టిన ‘వాట్సాప్ గవర్నెన్స్’ ప్రచారంలో జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. శుక్రవారం వీరవాసరం రైల్వే స్టేషన్ రోడ్డులోని కొత్తపేట సచివాలయం-2 పరిధిలో అధికారులతో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగారు. సాంకేతికతను అందిపుచ్చుకుని, సమయం వృథా కాకుండా ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జేసీ అన్నారు.
News December 19, 2025
పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నాయకులకు నిరాశ

ప.గో. జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకులకు నిరాశ ఎదురైంది. జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సర్వేలో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అంగర రామమోహన్ రావు పేరును బీసీ కోటాలో పరిశీలించారు. అయినప్పటికీ వీరు ఇరువురికీ పదవి దక్కలేదు. చివరికి మరోసారి ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు కట్టబెట్టారు.


