News November 12, 2024
ప.గో. జిల్లాలో రేంజ్ IG పర్యటన
ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రూరల్ సర్కిల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.
Similar News
News November 21, 2024
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్ వెట్రిసెల్వి
జిల్లాలో డిసెంబర్, 5వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చెప్పారు. గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి ఆమె సమీక్షించారు. డిసెంబర్ 5వ తేదీన జిల్లాలోని 20 పోలింగ్ కేంద్రాలలో పొలింగ్ జరుగుతుందన్నారు. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 9వ తేదీన వెలువడతాయని ఆమె తెలిపారు.
News November 21, 2024
శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం
శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.
News November 21, 2024
చంద్రబాబును జైలులో సీసీ కెమెరాలు పెట్టి చూశారు: MLA బొలిశెట్టి
అసెంబ్లీలో తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో నేతలపై అక్రమ కేసుల పెట్టిన వ్యవహారంపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. చంద్రబాబు నాయుడుని జైలులో పెట్టిన సమయంలో జైలులో సీసీ కెమెరాలు అమర్చి, వైసీపీకి చెందిన కీలక నేత ఆ వీడియోలు తన ఫోనులో చూసుకొనే విధంగా ఏర్పాట్లు చేశారని ఆరోపించారు. కారకులను శిక్షించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేశారు.