News April 14, 2024
ప.గో. జిల్లాలో సీఎం జగన్ పర్యటన వాయిదా

భీమవరంలో 15వ తేదీన జరగాల్సిన సీఎం పర్యటన వాయిదా పడిందని.. 16వ తేదీన ఉంటుదని వైసీపీ నాయకులు తెలిపారు. విజయవాడలో సీఎంపై జరిగిన దాడి నేపథ్యంలోనే వాయిదా పడిందని చెప్పారు. కాగా 16న జరిగే బస్సుయాత్ర, బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News September 10, 2025
‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.
News September 10, 2025
వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

రసాయన రహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.
News September 10, 2025
అత్తిలిలో నేటి నుంచి ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్

అత్తిలి రైల్వే స్టేషన్‌లో బుధవారం నుంచి సర్కార్, తిరుపతి పూరీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగనున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కూటమి నేతలు అత్తిలి మండలంలో ఆటో ప్రచారం ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేందుకు గత కొంతకాలంగా చేస్తున్న పోరాటం ఫలించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 4న కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రైలు హాల్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.