News November 24, 2025
ప.గో. జిల్లాలో 7 ఇసుక స్టాక్ పాయింట్స్: కలెక్టర్

జిల్లాలో పెద్దఎత్తున 7 ఇసుక నిల్వల స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఇంజనీరింగ్ సిబ్బంది ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను తీసుకోవాలన్నారు. తల్లికి వందనం సంబంధించి పెండింగ్లో ఉన్న 1,465 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ రాహుల్, డీఆర్ఓ శివన్నారాయణరెడ్డి ఉన్నారు.
Similar News
News November 24, 2025
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
News November 24, 2025
భీమవరం: మానసిక రోగుల గుర్తింపుపై పోస్టర్ ఆవిష్కరణ

మానసిక రోగుల గుర్తింపు, చికిత్స, పునరావాసం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మనోబంధు ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్ను ఎస్పీ నయీం అస్మి ఆవిష్కరించారు. సోమవారం ప.గో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో వీరి వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.
News November 24, 2025
దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.


