News January 3, 2026
ప.గో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీతారాం

పశ్చిమగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అంకెం సీతారాం నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్న సీతారాంను జిల్లా పగ్గాలు వరించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 27, 2026
భీమవరంలో క్రికెట్ పోటీలు ప్రారంభం

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, అందరూ అమితంగా ఇష్టపడేది క్రికెట్ అని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు అన్నారు. భీమవరంలో నాలుగు రోజులపాటు జరిగే పగో జిల్లా క్రికెట్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు ప్రారంభించారు. ముందుగా ఆయన బ్యాటింగ్ ఆడి అందరిని ఉత్సాహపరిచారు. జిల్లాలోని 7 నియోజక వర్గాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని అన్నారు.
News January 27, 2026
ప.గో: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

కాళ్ల(M) పెదమిరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద విషాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ కన్నయ్య(46) గుండెపోటుతో కన్నుమూశారు. నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. గతంలో APSPలో పనిచేసిన కన్నయ్య, ఆ తర్వాత AR విభాగానికి బదిలీపై వచ్చారు. నిబద్ధత కలిగిన అధికారిని కోల్పోవడంతో తోటి సిబ్బంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News January 27, 2026
ప.గో: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి.. చివరికి..!

మొగల్తూరులో పెళ్లి పేరుతో మోసానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఒడిశాకు చెందిన బాధితురాలు స్థానిక రొయ్యల పరిశ్రమలో పని చేస్తోంది. యనమదుర్రుకు చెందిన రాధాకృష్ణ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించి, పలుమార్లు లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై నాగ లక్ష్మి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


