News April 24, 2025
ప.గో జిల్లా టాపర్ ఈ బాలికే..!

నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతీ బా పూలే గురుకుల పాఠశాల (బాలికలు)విద్యార్థులు పదో తరగతి ఫలితాలలో ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని రావి అశ్విని 592 మార్కులు సాధించి జిల్లాస్థాయిలో సాధించి ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపల్ సీహెచ్ కె. శైలజ తెలిపారు. పెరవలి గ్రామానికి చెందిన అశ్విని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ ఉంటారు.
Similar News
News July 7, 2025
పాలకోడేరు: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 15 అర్జీలు స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.
News July 7, 2025
ప్రతి విద్యార్థికి ఒక మొక్క అందజేత: కలెక్టర్

‘ఏక్ పెడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక మొక్కను అందజేసి, వారి తల్లి పేరున పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ విషయంపై మాట్లాడారు. ఇందుకోసం ‘లీప్ యాప్’ను రూపొందించి, అందులో విద్యార్థులు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News July 7, 2025
జిల్లాలో ఎరువుల కొరత లేదు: జేసీ

పశ్చిమ గోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ సోమవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 44,792 మెట్రిక్ టన్నుల ఎరువులు ప్రైవేటు, ఏపీ మార్కెట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు కావలసిన మొత్తం ఎరువులు లభ్యంగా ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ రాహుల్ స్పష్టం చేశారు.