News April 9, 2025

ప.గో జిల్లా వాసులకు గ్యాస్ భారం

image

గ్యాస్ ధరల పెంపు ప.గో జిల్లా సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో రూ. 860కి చేరింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా వినియోగదారుని సొమ్ముతో సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. పలు కారణాలతో ఆ నగదు వినియోగదారుని ఖాతాకు జమ కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్.

Similar News

News April 18, 2025

ప.గో: తప్పులు లేకుండా పూర్తి చేయాలి..కలెక్టర్ 

image

ఓటరు నమోదు, చేర్పులు, మార్పులు, క్లెయిమ్స్ పరిష్కార ప్రక్రియను తప్పులు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. గురువారం భీమవరంలో కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై క్లెయిమ్స్ పరిష్కారం పై సమీక్షించారు. జిల్లాలో మొత్తం ఓటర్లు14లక్షల 70వేల 886మంది ఉండగా వీరిలో పురుషులు 7లక్షల 20వేల 613మంది, మహిళలు 7లక్షల 50వేల 197మంది, ట్రాన్స్ జెండర్స్ 77మంది ఉన్నారన్నారు.

News April 17, 2025

పాలకొల్లు: చాంబర్స్ కళాశాలలో 17న మెగా జాబ్ మేళా

image

ఈనెల 17 గురువారం ఉ.9 గంటల నుంచి పాలకొల్లు చాంబర్స్ కళాశాలలో ఏపీ ప్రభుత్వ శిక్షణ, ఉద్యోగ కల్పనా సంస్థ సౌజన్యంతో 13 కంపెనీలతో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డి.వెంకటేశ్వరరావు చెప్పారు. ఐసీఐసీఐ, హెచ్‌డి‌ఎఫ్‌సి ,హెచ్డిబి, డెక్కన్ కెమికల్స్, పానాసోనిక్, ఇండో ఎంఐఎం, ఇసుజు, కాగ్నిజెంట్ వంటి బ్యాంకింగ్, ఐటి, నాన్ ఐటీ సంస్థలకు చెందిన వారు 470 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.

News April 17, 2025

రోడ్డు ప్రమాదంలో పెనుగొండ యువకుడు మృతి

image

వడలి పిట్టల వేమవరం రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుగొండకు చెందిన తడివాడ భార్గవ్(17) మృతి చెందాడు. స్నేహితుడితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా వెనుక వస్తున్న వ్యాను టచ్ చేయడంతో మోటార్ సైకిల్ పక్కనే ఉన్న చెట్టుని బలంగా ఢీకొంది. దీంతో భార్గవ్ తలకు బలమైన గాయం కావడంతో ఘటన ప్రాంతంలో మ‌ృతి చెందాడు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు.

error: Content is protected !!