News March 1, 2025
ప.గో. జిల్లా TODAY TOP HEADLINES

✷ తాడేపల్లిగూడెంలో పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్ ✷ జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం ✷ మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు ✷ ఢిల్లీలో వర్క్ షాపునకు ఎంపికైన మహదేవపట్నం సర్పంచ్ ✷ పోలీస్ ఇండోర్ పరీక్షల్లో టాపర్‌గా మార్టేరు అమ్మాయి ✷ తణుకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ ✷ తణుకులో 123 మంది పరీక్షలకు గైర్హాజరు
Similar News
News January 27, 2026
ప.గో: ప్రేమ పేరుతో యువతిని నమ్మించి.. చివరికి..!

మొగల్తూరులో పెళ్లి పేరుతో మోసానికి పాల్పడిన యువకుడిపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఒడిశాకు చెందిన బాధితురాలు స్థానిక రొయ్యల పరిశ్రమలో పని చేస్తోంది. యనమదుర్రుకు చెందిన రాధాకృష్ణ ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించి, పలుమార్లు లోబరుచుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై నాగ లక్ష్మి నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News January 26, 2026
ప.గో: జిల్లాలో పెరిగిన మార్కెట్ విలువలు

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2026వ సంవత్సర మార్కెట్ విలువలను పెంచుతూ ఉత్తర్వలు జారీచేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్కెట్ విలువలు పెరుగుతాయని జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. 0 నుంచి 25% వరకు మార్కెట్ విలువలు పెరిగాయని జిల్లాలోని 15 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అన్నారు.
News January 26, 2026
ఏలూరు జిల్లాలో 595 మందికి అవార్డులు

ఏలూరు జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 595 మంది ఉద్యోగులకు సోమవారం కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలు అందజేయనున్నారు. వీరిలో డీఆర్‌ఓ విశ్వేశ్వరరావు, ఏఎస్పీలు సుస్మిత, సూర్యచంద్రరావు సహా 14 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. వేడుకల్లో వీరిని ఘనంగా సత్కరించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.


