News April 19, 2025
ప.గో: జేసీ హెచ్చరికలు

షాపులు నిర్వాహకులు రోడ్ల పక్కన చెత్త వేస్తే చర్యలు తప్పవని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం జేసీ భీమవరం పట్టణంలో పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోడ్డు పక్కన వ్యాపారస్తులు వద్దకు వెళ్లి చెత్త ఎక్కడ వేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
Similar News
News December 28, 2025
నిర్మలా సీతారామన్‌కు సైకత శిల్పంతో స్వాగతం

నరసాపురం మండలం పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రామ అభివృద్ధి ప్రదాత నిర్మలా సీతారామన్‌కు సుస్వాగతం’ అంటూ రూపొందించిన సైకత శిల్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తీర ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News December 28, 2025
నరసాపురంలో నిర్మలా సీతారామన్ పర్యటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నరసాపురం మండలం పెదమైనవానిలంకలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్‌ను ప్రారంభించారు. పాఠశాలలోని వసతులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో చర్చించారు.
News December 28, 2025
పశ్చిమ గోదావరి కలెక్టర్‌కు పదోన్నతి

ప్రభుత్వం 2010 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐఏఎస్ అధికారులకు సూపర్ టైమ్ స్కేల్ (లెవల్-14)కు పదోన్నతి కల్పించింది. వీరిలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఉన్నారు. ఈ పదోన్నతి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వం ఆమెను కార్యదర్శి హోదాకు పెంచినప్పటికీ, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్‌గా అదే స్థానంలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.


