News June 4, 2024
ప.గో.: తాజా UPDATE.. 14 చోట్ల కూటమి ఆధిక్యం
ఉమ్మడి ప.గో. జిల్లాలోని 15 అసెంబ్లీ స్థానాల్లో 9 చోట్ల టీడీపీ, 5 చోట్ల జనసేన, ఒకచోట వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దాదాపు అన్నీచోట్ల 3 రౌండ్లు పూర్తయ్యాయి. పోలవరంలో వైసీపీ అభ్యర్థి లీడ్ లో ఉండగా.. అక్కడ మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 62 ఓట్ల లీడ్ ఉంది.
Similar News
News November 28, 2024
ఏలూరు: నవంబర్ 30న రూ.112.68 కోట్ల పంపిణీ
NTR భరోసా పెన్షన్ పంపిణీలను నవంబర్ 30న లబ్దిదారులకు 100 శాతం అందజేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 2,62,836 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.112.68 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల పింఛన్లను ఒకరోజు ముందుగా అందిస్తున్నామన్నారు. పెన్షన్ పంపిణీలో పొరపాట్లు ఉండకూడదని హెచ్చరించారు.
News November 28, 2024
పగో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలి: కలెక్టర్
ప.గో జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్ వశిష్ట కాన్ఫరెన్స్ మందిరంలో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పనతో జిల్లాకు ప్రత్యేక స్థానం దక్కాలని అధికారులకు సూచించారు. జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల ప్రగతిపై ఆరా తీశారు. రోడ్డు గుంతల పూడ్చివేత, పల్లె పండుగలో చేపట్టిన రోడ్డు పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి కావాలన్నారు.
News November 28, 2024
ఈవీఎం గోడౌన్ తనిఖీ: కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు కలెక్టరేట్‌లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్‌లు భద్రపరిచే గోడౌన్‌ను గురువారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్ తనిఖీ చేశారు. గోదాం తాళాలు, సిసి కెమెరాలు పనితీరు, అగ్నిమాపకదళ పరికరాలను పరిశీలించారు. అనంతరం సెక్యూరిటీ లాగ్ బుక్‌ను పరిశీలించి సంతకం చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.