News June 4, 2024

ప.గో.: తొలి MPలు తేలేది మనోళ్లే.. ఎవరో చూడండి

image

పార్లమెంట్ ఎన్నికల్లో తొలిఫలితం రాజమండ్రి, నరసాపురం MP స్థానాల్లో రానుంది. కాగా అమలాపురంలో ఎంపీ నియోజకవర్గంలో ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. కాగా రాజమండ్రిలో కూటమి నుంచి పురందీశ్వరి, వైసీపీ నుంచి గూడూరి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇక నరసాపురంలో కూటమి నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, గూడూరి ఉమాబాల, అటు అమలాపురంలో వైసీపీ నుంచి రాపాక శ్రీనివాస్, కూటమి నుంచి గంటి హరీష్ మాదుర్ బరిలో ఉన్నారు.

Similar News

News September 13, 2025

తాగునీటి చెరువులో పడి మూడేళ్ల చిన్నారి మృతి

image

అత్తిలి మండలం రామన్నపేటలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ పాఠశాలలో చదువుతున్న సప్పా మోహిత (3) అనే చిన్నారి మధ్యాహ్నం భోజనం చేసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు దగ్గరలో ఉన్న మంచినీటి చెరువులో పడి మృతి చెందింది. ఘటన సమయంలో అంగన్వాడీ కేంద్రంలో టీచర్, ఆయమ్మ లేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తాపీ పని చేసుకునే మోహిత తండ్రి శివ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర విషాదంలో ముంచింది.

News September 13, 2025

భీమవరం: సోమేశ్వర జనార్ధన స్వామిని తాకిన సూర్య కిరణాలు

image

భీమవరం గునుపూడిలో కొలువైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారిని శనివారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. సూర్యోదయ సమయంలో ఈ అద్భుత దృశ్యం కనిపించిందని ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ తెలిపారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారని ఆయన చెప్పారు.

News September 12, 2025

ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలి: జేసీ

image

జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అక్టోబర్ మొదటి వారం నుంచి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు ప్రారంభం కావున అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.