News December 29, 2025
ప.గో: దర్శనానికి వేళాయె.. ఏడాదికోకసారి లభించే భాగ్యం

ద్వారకాతిరుమల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా గిరిప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం 5 కిలోమీటర్ల మార్గంలో ఎండుగడ్డి, టెంట్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గం: నుంచి ఏడాదికొకసారి లభించే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది.
Similar News
News December 30, 2025
భీమవరం: ఈవీఎంల భద్రతపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

భీమవరం పట్టణంలోని పీపీ రోడ్డులో గల ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లలో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం తనిఖీ చేశారు. గోడౌన్లకు వేసిన సీళ్లను, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, రిజిస్టర్లలో సంతకాలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News December 30, 2025
పాలకొల్లు ఉపాధ్యాయునికి ‘గురు చైతన్య’ పురస్కారం

పాలకొల్లు: పట్టణంలోని జీవీఎస్వీఆర్ మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని జి.నందిని ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డుకు ఎంపికయ్యారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లాకు ఏడుగురు చొప్పున ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. జనవరి 3న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
News December 30, 2025
వంద ఏళ్ల నిరీక్షణకు తెర.. ‘మోదెల’ గ్రామానికి విద్యుత్ భాగ్యం!

శతాబ్ద కాలంగా విద్యుత్‌కు నోచుకోని మారుమూల గిరిజన గ్రామం ‘మోదెల’ ఎట్టకేలకు సౌరకాంతులతో మెరిసిపోయింది. జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ వెట్రిసెల్వి చొరవ తీసుకుని రూ. 12.5 లక్షలతో సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేయించారు. 23 గిరిజన ఇళ్లకు విద్యుత్ సౌకర్యం లభించడంతో, గ్రామస్తులు కలెక్టరేట్‌కు విచ్చేసి జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ, విద్యుత్ శాఖ అధికారులను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.


