News October 4, 2024

ప.గో: దసరా వేళ.. భారీగా వసూళ్లు

image

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు, పనులు చేసుకొనే వారు ప.గో జిల్లాలోని సొంతూళ్లకు పయనమయ్యారు. అయితే పండుగకు నెల రోజుల క్రితమే రైలు, ఇతర ఆర్టీసీ బస్సు సీట్లు బుక్ అయిపోయాయి.ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యం అధిక రేట్లు పెంచి రెచ్చిపోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదేమీ లేక రూ.వేలలో చెల్లించి ఊరికి చేరుతున్నారు. దీనిపై ఆ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News October 4, 2024

హైదరాబాద్ -నరసాపురం మధ్య ప్రత్యేక రైలు

image

నరసాపురం, హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 30 వరకు ప్రతి శని, ఆదివారాల్లో రైలు నంబర్ 07631 శనివారం రాత్రి 11.15కి హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.35 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. తిరిగి ఆదివారం రాత్రి 8గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6గంటలకు హైదరాబాద్ వెళుతుంది. విజయవాడ, గుంటూరు మీదుగా ఈ రైలు నడుస్తుందన్నారు.

News October 4, 2024

జంగారెడ్డిగూడెం: అమ్మను కొట్టిందని అక్కపై కత్తితో దాడి

image

అమ్మను కొట్టిందని తమ్ముడు అక్కపై కత్తితో దాడి చేసిన ఘటన జంగారెడ్డిగూడెంలో జరిగింది. స్థానికుల కథనం.. ఏసోబు, అతని తల్లి వద్దనే ఎస్తేరు రాణి భర్తతో విడిపోయి ఉంటోంది. తల్లితో అప్పుడప్పుడూ రాణి గొడవ పడేది. ఈక్రమంలో గురువారం వాగ్వాదం జరిగి తల్లిని కొట్టి వెళ్లిపోయింది. పని నుంచి వచ్చిన ఏసోబుకు తల్లి విషయం చెప్పింది. దీంతో ఏసోబు కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు అతడిని పోలీసులకు అప్పగించారు.

News October 4, 2024

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌పై వేటు

image

బుట్టాయగూడెం మండలం బూసరాజుపల్లి గురుకుల పాఠశాల విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్ మురళీకృష్ణపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేసినట్లు ఏపీవో, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు జేసీ ధాత్రిరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు. పాఠశాలలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రిన్సిపల్ విజయలక్ష్మిని గురుకులానికి సరెండర్ చేశారు.