News July 6, 2024
ప.గో: ‘నేడే.. మర్చిపోకుండా టీకాలు వేయించండి’

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జూనోసిస్ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల నివారణ కోసం రేబిస్ టీకాలు వేయనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా పెంపుడు జంతువులకు టీకాలు వేయించాలని కోరారు. రేబిస్ లక్షణాలున్న పెంపుడు జంతువు కరిస్తేనే కాకుండా వాటి చొంగ వల్ల కూడా రేబిస్ సోకుతుంది.
Similar News
News November 2, 2025
ఉండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఉండి మండలం నక్కరాజగుంట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉండి నుంచి ఆకివీడు వెళుతున్న గంధం రాఘవులు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 2, 2025
బియ్యం బస్తా మోసిన ఎమ్మెల్యే నాయకర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన వేములదీవిలో శనివారం నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో 50 కేజీల బియ్యం బస్తా, ఇతర సరుకులను ఇంటికి తీసుకెళ్లలేక ఇబ్బంది పడుతున్న ఒక దివ్యాంగురాలిని ఎమ్మెల్యే నాయకర్ గమనించారు. వెంటనే ఆయనే స్వయంగా బియ్యం బస్తాతో సహా సరుకులన్నింటినీ తన భుజాలపై మోసుకుని, ఆమె త్రిచక్ర వాహనం వరకూ చేర్చారు. ఆపదలో ఉన్న బాధితురాలికి ఎమ్మెల్యే చేసిన సాయం ఆదర్శంగా నిలిచింది.
News November 2, 2025
నరసాపురం: ‘లోక్ అదాలత్‌పై దృష్టి సారించాలి’

డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి వాసంతి అన్నారు. ఈ మేరకు శనివారం నరసాపురం కోర్టు హాలులో పోలీసు ఉన్నతాధికారులతో, న్యాయవాదులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. కక్షిదారులకు తక్కువ సమయంలో సమ న్యాయం అందించడానికి పోలీస్ అధికారులు, న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.


