News June 17, 2024
ప.గో: పంట పొలంలోకి దూసుకెళ్లిన కారు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో ఓ కారు పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళుతుండగా లొల్ల-వాడపల్లి కొత్త రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. కారులోని ప్రయాణికులు తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారుగా స్థానికులు తెలిపారు. ప్రయాణికులు వెంటనే కారులోంచి బయటకు వచ్చేశారు. స్థానికుల సహాయంతో కారును పంట పొలంలోంచి బయటకు తీశారు.
Similar News
News November 7, 2025
జావెలిన్ త్రోలో కొంతేరు కుర్రాడి సత్తా

యలమంచిలి(M) కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 22న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అరుణ్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.
News November 7, 2025
ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.
News November 7, 2025
నరసాపురం వరకు పొడిగించిన వందే భారత్ రైలు

కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నరసాపురం వరకు పొడిగిస్తూ కేంద్ర రైల్వే శాఖ నుంచి దక్షిణ మధ్య రైల్వేకు గురువారం ఉత్తర్వులు అందాయి. దీంతో ఇక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


