News January 15, 2025
ప.గో : పందేలలో పచ్చకాకిదే హవా

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం కుక్కుట శాస్త్రం ఉందని పందెం రాయుళ్లు చెబుతున్నారు. మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు పందెంరాయుళ్లు చెబుతున్నారు. దీంతో కుక్కుట శాస్త్రంలో అవగాహన ఉన్నవాళ్లు మంగళవారం అంతా పచ్చకాకి కోడి పుంజుల హవానే కొనసాగిందని అంటున్నారు.
Similar News
News October 28, 2025
4,155 మందికి పునరావాసం: కలెక్టర్

మొంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 37 పునరావాస కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్నం నాటికి 4,155 మంది బాధితులకు భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 3,581 ఎకరాల వరి పొలాల్లో వర్షపు నీరు చేరిందని, జిల్లాలో తుఫాను కారణంగా 10 గ్రామాలు ముంపునకు గురి కాగలదని గుర్తించడం జరిగిందని ఆమె వెల్లడించారు.
News October 28, 2025
జిల్లాలో మరిన్ని పునరావాస కేంద్రాలు: కలెక్టర్

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 29 పునరావస కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం 19 పునరావాస కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
News October 28, 2025
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో 200 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు 24 గంటలూ అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ నాగరాణి మంగళవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షలో ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, మండలాలకు పంపిన డ్రోన్స్ వెంటనే వినియోగించాలని సూచించారు. ఏ సమస్య వచ్చినా తక్షణం పరిష్కరించాలని స్పష్టం చేశారు.


