News October 7, 2025

ప.గో. పాఠశాలలకు ‘స్వచ్ఛ స్కూల్స్’ అవార్డులు

image

‘స్వచ్ఛ స్కూల్స్’ విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు పాఠశాలలు అవార్డులు అందుకున్నాయి. అత్తిలి గర్ల్స్ హైస్కూల్, వీరవాసరం, పాలకోడేరు జడ్పీహెచ్ స్కూల్, భీమవరం జేఎల్‌బీ హైస్కూల్, వెంకట్రావుపాలెం పీఎం స్కూళ్లకు ఈ గుర్తింపు లభించింది. కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవార్డులను అందుకున్నారు.

Similar News

News October 7, 2025

రేపు పెదఅమిరం రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడినుంచి పెదఅమిరం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

News October 7, 2025

నిబంధనలకు లోబడి దీపావళి టపాసులు అమ్మాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో దీపావళి టపాసుల తయారీ, అమ్మకాలకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలంతా దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. టపాసులు విక్రయించేవారు ప్రభుత్వ నిబంధనలను లోబడి మాత్రమే అమ్మకాలు చేపట్టాలని హెచ్చరించారు. భద్రతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు.

News October 7, 2025

రామాయణం మన పూజ్య గ్రంథం: కలెక్టర్ నాగరాణి

image

రామాయణ మహా కావ్యాన్ని రచించి మానవాళికి అందించి సన్మార్గాన్ని నిర్దేశించిన ఆదర్శప్రాయుడు మహర్షి వాల్మీకి అని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతి నిర్వహించారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. పుణ్యభూమి, కర్మభూమి మన భారతదేశమని, రామాయణం మన పూజ్య గ్రంథమన్నారు.