News January 12, 2025

ప,.గో: పిల్లల్ని దత్తతు తీసుకునేందుకు వెళ్తుండగా ప్రమాదం

image

శంఖవరం మండలం కత్తిపూడిలో హైవేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. భీమవరానికి చెందిన సత్యనాగమధు కుటుంబీకులు, స్నేహితుడు మొత్తం ఏడుగురు శనివారం అన్నవరం బయలుదేరారు. ప్రమాద స్థలంలో శ్యాంప్రసాద్, దివ్య, ఆమె భర్త శివనారాయణ మృతిచెందారు. శ్యాంప్రసాద్ దంపతులకు పెళ్లై పదేళ్లు అయినా పిల్లలు కలగకపోవడంతో దత్తతు తీసుకునేందుకు వారు అన్నవరం బయలుదేరగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News February 25, 2026

ప.గో: నిరుద్యోగ యువతకు GOOD NEWS

image

భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

News February 24, 2026

ప.గో జిల్లా కలెక్టర్ హెచ్చరిక

image

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి మెడికల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని విభాగాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.