News February 5, 2025
ప.గో: పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎర వేస్తారు

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు ఉమ్మడి ప.గో జిల్లాలోని యువత బానిసలవుతున్నారు. చిరువ్యాపారులు, నిరుద్యోగులు ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి రోడ్డున పడుతున్నారు. ఇటీవల భీమవరంలో ఓ చిరు వ్యాపారి రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. అనంతరం అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, పిల్లలను పెద్దవారు నిత్యం గమనిస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News September 14, 2025
రేపు విశాఖ ప్రభుత్వ కార్యాలయాలలో పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమీషనర్ కేతాన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. కలెక్టర్ కార్యాలయంలో, సీపీ, జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News September 14, 2025
త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
News September 14, 2025
శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు