News March 23, 2025
ప.గో: ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..కలెక్టర్

స్వచ్ఛఆంధ్ర లక్ష్యసాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్లో స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మార్కెటింగ్ శాఖ ఏడితో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడ రోడ్లపై చెత్త వేయకూడదని, ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకూడదన్నారు.
Similar News
News March 24, 2025
ఏలూరులో యువతిపై ముగ్గురు అత్యాచారం

ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. జేపీ నగర్‌కు చెందిన వంశీకృష్ణ ఓ యువతి(18)ని ప్రేమిస్తున్నానని నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ వంశీకృష్ణ స్నేహితులు సాయిచరణ్, శివశంకర్ సైతం ఆమెపై అత్యాచారం చేశారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురితో పాటు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మొత్తం ఏడుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 24, 2025
ప.గో: EKYC ఎక్కడ చేస్తారంటే..?

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప.గో జిల్లాలో లక్షల్లో రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా మంది EKYC చేయించుకోలేదు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్లు, సచివాలయాల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్లలోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.
News March 24, 2025
ఈనెల 31లోగా దరఖాస్తులు: కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత ఈనెల 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదివారం కోరారు. పది, ఇంటర్, డిగ్రీ తరగతులు, ఐటీఐ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 550 పరిశ్రమలో వీరికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు.