News March 18, 2025
ప. గో: ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్

జిల్లాలో ప్రయోగాత్మకంగా గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్లో డీఆర్డీఏ, వ్యవసాయ, ఇరిగేషన్, డీపీవో, టూరిజం శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. గుర్రపు డెక్కతో వర్మీ కంపోస్ట్ రూపొందించడంపై చర్చించారు. గుర్రపు డెక్కతో ఆర్నమెంటల్ వస్తువులను కూడా రూపొందించేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 18, 2025
కాళ్ల : శివయ్యను తాకిన సూర్యకిరణాలు

కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం అద్భుత సన్నివేశం చోటుచేసుకుంది. గర్భాలయంలోని శివలింగాన్ని సుమారు పది నిమిషాల పాటు సూర్యకిరణాలు తాకాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు స్వామివారి లింగాన్ని సూర్యకిరణాలు తాకటం విశేషమని తెలిపారు. భక్తులు తరలివచ్చి అద్భుత సన్నివేశాన్ని చూస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
News March 18, 2025
ప.గో జిల్లాకు కొత్త అధికారి

ప.గో జిల్లా DMHOగా డాక్టర్ జి. గీతాబాయి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ.. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎం. కృష్ణబాబు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పూర్వ డీఎంహెచ్వో డా. మహేశ్వరరావు గత ఏడాది డిసెంబరులో పదవీ విరమణ చేయగా.. అప్పటి నుంచి డా. బానూనాయక్ బాధ్యతలు చూసుకుంటున్నారు. గీతాబాయి నేడు బాధ్యతలు చేపట్టనున్నారు.
News March 18, 2025
ప.గో : మహిళపై అత్యాచారం

అత్యాచారంపై న్యాయం చేయాలని ఆమె, కుటుంబీకులు సోమవారం ఏలూరు ఐజీ జీవీజీ అశోక్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఉండికి చెందిన తనపై రవి, సోమేశ్వరరావు పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.2.30 లక్షలు తీసుకున్నారని ఆరోపించింది. ఉండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే భర్త, మరిదిపై కౌంటర్ కేసు పెడతామని బెదిరించినట్లు తెలిపారు. విచారణ అధికారిగా ప.గో జిల్లా SPని నియమించినట్లు సమాచారం.