News August 30, 2024
ప.గో: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువకుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలానికి చెందిన రవికుమార్ తనను మోసం చేశాడని ప.గో జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసినట్లు నరసాపురం రూరల్ SI సురేశ్ తెలిపారు. దీంతో రవికుమార్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
ప.గో: EX MLA పేరుతో INSTA అకౌంట్.. నమ్మితే అంతే..!

నరసాపురం మాజీ MLA కొత్తపల్లి జానకీ రామ్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఖాతాల ద్వారా అభిమానులకు మెసేజ్‌లు పంపుతూ డబ్బులు అడుగుతున్నట్లు ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు, అనుచరులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికీ డబ్బులు పంపి మోసపోవద్దని జానకీ రామ్ కోరారు.
News February 22, 2026
భీమవరం: అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీగా ఉండి, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోలేదన్న ఆరోపణలపై ప్రస్తుతం ప.గో.జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
News February 22, 2026
క్రమశిక్షణతోనే ఉన్నత శిఖరాలు: కలెక్టర్

ఆకివీడు మండలం దుంపగడప వి.వి.గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది డిగ్రీ ఫైనల్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని శోభారాణికి రూ.3 వేల నగదు బహుమతిని కలెక్టర్ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె. సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


