News July 13, 2024

ప.గో: బైక్‌పై వస్తుండగా చెట్టు విరిగిపడి వ్యక్తి దుర్మరణం

image

పెరవలి మండలం ఖండవల్లిలోని పౌల్ట్రీ వద్ద చెట్టు విరిగి పడటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల వివరాల ప్రకారం.. చాగల్లుకు చెందిన కువలేశ్ ఇరగవరం మండలం పేకేరులోని బంధువుల ఇంటికెళ్లాడు. తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా ఖండవల్లి వద్ద చెట్టు విరిగి అతడిపై పడింది. తలకు తీవ్ర గాయాలైన కువలేశ్‌ను తణుకు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

భీమవరం: బ్యాంకుల అధికారులపై కలెక్టర్ అసహనం

image

పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎస్‌హెచ్‌సి గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలని సూచించారు.

News November 7, 2025

ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

image

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.

News November 7, 2025

భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

image

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.