News August 18, 2025

ప.గో: భారీ వర్షాలు.. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

భారీ వర్షాల దృష్ట్యా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. అత్యవసర సహాయం కోసం 08816 299181 నంబర్‌తో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అధికారుల సెలవులు రద్దు చేస్తూ, గజ ఈతగాళ్లను, మోటార్ బోట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజలు సముద్రం, గోదావరి నది వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.

Similar News

News August 18, 2025

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నాగరాణి

image

వాతావరణ శాఖ భారీ వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని, దీని కారణంగా ఏపీకి మరో 3 రోజులు భారీ వర్షసూచన ఉన్నట్టు ప్రకటించిందన్నారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు.

News August 17, 2025

ప.గో: రేపు పీజీఆర్‌ఎస్ రద్దు

image

అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రానున్న మూడు రోజులు అధిక వర్షాలు హెచ్చరికల నేపథ్యంలో రేపు 18న సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో జరగాల్సిన పీజీ‌ఆర్‌ఎస్ రద్దు సమాచారాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించవలసిందిగా కలెక్టర్ కోరారు.

News August 17, 2025

స్త్రీ, శిశు సంక్షేమ అధికారులతో మంత్రి గుమ్మిడి సమీక్ష

image

మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప.గో జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ & శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి పాలకొల్లు వచ్చిన సందర్భంగా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై సమగ్రంగా తెలుసుకున్నారు. ముఖ్యంగా 1626 అంగన్వాడీ కేంద్రాల పని తీరు, పిల్లలకు అందుతున్న పోషకాహారం, విద్య, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.