News January 4, 2025
ప.గో: మంత్రి నాదెండ్లను కలిసిన దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ శుక్రవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాదెండ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇరువురు పలు శాఖా పరమైన అంశాలు చర్చించినట్లు తెలిపారు.
Similar News
News January 6, 2025
ప.గో: సంక్రాంతి ట్రైన్లు.. 8 గంటలకు బుకింగ్
➤కాకినాడ టౌన్- చర్లపల్లి(07038): 14వ తేదీ
➤సికింద్రాబాద్-కాకినాడ(07078): 12, 19
➤చర్లపల్లి-కాకినాడ(07031): 8, 10, 14, 16, 18
➤కాకినాడ-చర్లపల్లి(07032): 9, 11, 13, 15
➤చర్లపల్లి- నర్సాపూర్(07035): 11, 18
➤నర్సాపూర్- చర్లపల్లి(07036):12,19
➤చర్లపల్లి- నర్సాపూర్(07033):7, 9, 13, 15, 17
➤ చర్లపల్లి- నర్సాపూర్(07034):8, 10, 14, 16, 18
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.
News January 6, 2025
ప.గో: పతనమైన టమాట ధర
టమాట ధర నేల చూపులు చూస్తోంది. మదనపల్లె మార్కెట్‌లో కనిష్ఠంగా కిలో రూ.13 పలికింది. గ్రేడ్‌ని బట్టి 10 కేజీల బాక్స్ ధర రూ.130 నుంచి 160 వరకు ఉంది. చిత్తూరుతో పాటు స్థానికంగా పంట అందుబాటులోకి రావడంతో డిమాండ్ తగ్గి ధర పడిపోయిందని ఉమ్మడి ప.గో జిల్లా హోల్ సేల్ వ్యాపారులు తెలిపారు. 25 కిలోల ట్రే రూ.300లు ధర పలికిందని చెప్పారు. ధర తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
News January 6, 2025
లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్
భీమవరం పట్టణంలోని ఎస్ఆర్‌కేఆర్ కళాశాలలో రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆదివారం రాత్రి పరిశీలించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయాలని డిప్యూటీ స్పీకర్ అధికారులకు సూచించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, ఏపీ ఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.