News February 19, 2025
ప.గో: మడ అడవులను పరిశీలించిన కలెక్టర్

నరసాపురం మండలం దర్భరేవు, రాజులలంక గ్రామాల్లో మంగళవారం మడ అడవులను కలెక్టర్ బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక రైతులతో తాబేళ్ల సంరక్షణ, మడ అడవులు పరిరక్షణపై జిల్లా కలెక్టర్ మాట్లాడి, తగు సూచనలు చేశారు.
Similar News
News March 14, 2025
రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు వాసి మృతి

రాజమండ్రి మోరంపూడి ఫ్లై ఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొల్లు(M) గొల్లవాని చెరువుకు చెందిన సాయినరేశ్ (30) మృతి చెందాడు. గుంటూరు జిల్లాకు చెందిన రమేశ్ తో బొమ్మూరు వైపు వెళ్తుండగా.. వెనుకనుంచి కారు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని గురువారం కుటుంబీకులకు బొమ్మూరు పోలీసులు అప్పగించి, కేసు నమోదు చేశారు. నరేశ్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.
News March 13, 2025
భీమవరం: జనసేన సభకు వెళ్లే వారికి ప్రత్యేక రూట్లు

పశ్చిమ గోదావరి, గుంటూరు, తెనాలి, కృష్ణ, జిల్లాల నుంచి వెళ్లే వాహనాలు తూరంగి బ్రిడ్జి నుంచి ఉప్పలంక బైపాస్ చీడిగ, ఇంద్రపాలెం, కెనాల్ రోడ్డు, సామర్లకోట మూడు లైట్లు జంక్షన్, మూత్తా గోపాలకృష్ణ ఫ్లైఓవర్, అచ్చంపేట జంక్షన్ మీదుగా చిత్రాడ సభ ప్రాంగణానికి చేరుకొవాలన్నారు. ఆయా మార్గాల్లో అభిమానులకు భోజనాలు, మజ్జిగ వంటి సదుపాయాలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు.
News March 13, 2025
భీమవరంలో బాంబు బెందిరింపు.. పలు కోణాల్లో దర్యాప్తు

భీమవరం విష్ణు కళాశాలలో బుధవారం బాంబు పెట్టామన్న ఈ మెయిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి నుంచి మెయిల్ వచ్చిననట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంటు దాడి ఘటనలో సూత్రధారి అప్జల్ గురుకు శిక్ష విధించినందుకు నిరసనగా కళాశాలలో బాంబు పెట్టినట్లు ఈ మెయిల్‌లో పేర్కొన్నాడు. అది అతడి నుంచి వచ్చిందా? లేదా మరోకరు పంపించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని DSP జయసూర్య తెలిపారు.