News November 22, 2024
ప.గో: మళ్లీ వైసీపీలోకి చేరుతున్న నేతలు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నేతలు తిరిగి ఆ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా తాళ్లపూడి ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు గురువారం వైసీపీలోకి చేరారు. నిడదవోలు 28వ వార్డు కౌన్సెలర్ ఆకుల ముకుందరావు, 10వ వార్డు కౌన్సిలర్ అరుగోలను వెంకటేశ్వరరావు మళ్లీ పార్టీ అధినేత సమక్షంలో సొంత గూటికి చేరారు.
Similar News
News March 1, 2026
నరసాపురం: పెద్ద మనిషిలా వచ్చి.. బాలికపై లైంగిక వేధింపులు

నరసాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక కుటుంబ వివాదాలను చక్కదిద్దుతామని పెద్ద మనిషిలా వచ్చి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి రావాల్సిన నగదు విషయంలో నిందితుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆమెను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 1, 2026
తాగునీటి సరఫరాకి ఇబ్బందులు లేకుండా చూడండి: జేసీ

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భీమవరం కార్యాలయంలో నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం సమీక్షించారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా నీటి నిల్వలు, పంపింగ్ స్టేషన్లు, పైప్‌లైన్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News February 28, 2026
ఉండి: గ్యాస్ ప్రమాదం ఘటనలో మరో మహిళ మృతి

ఉండి చిక్కాల వీరన్న నగరంలో ఈనెల 24వ తేదీన జరిగిన గ్యాస్ సిలిండర్ ప్రమాదంలో తల్లీకూతుర్లు మృతి చెందారు. ఎస్సై నజీరుల్లా తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ సర్వీస్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి నలుగురికి గాయాలు అయ్యాయి. వీరిలో లక్ష్మి (50) గురువారం మృతి చెందింది. ఆమె తల్లి సుబ్బాయమ్మ (70) ఇప్పటికే మృతి చెందారు. మిగిలిన ఇద్దరు విజయవాడలో చికిత్స పొందుతున్నారని అన్నారు.


