News December 27, 2025
ప.గో: మాజీ డిప్యూటీ సీఎం.. జాడలేరు!

మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు నేత ఆళ్ల నాని వ్యవహారశైలి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ఓటమి తర్వాత టీడీపీలో చేరిన ఆయన అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. తనను నమ్ముకున్న అనుచరులకు, టీడీపీ శ్రేణులకు అందుబాటులో లేకపోవడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షుడిని సైతం కలవకపోవడంతో ఆయన పార్టీ మార్పు కేవలం రక్షణ కోసమేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Similar News
News December 27, 2025
వామ్మో చిరుత.. భయాందోళనలో అటవీ గ్రామాలు

చిరుత సంచారంతో కోనరావుపేట మండలంలోని అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. శివంగలపల్లి, మరిమడ్ల, వట్టిమల్ల గ్రామాల శివారుల్లో చిరుత ఆవులు, మేకలను చంపిన విషయం మరువకముందే తాజాగా వట్టిమల్ల గొల్లపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు గొర్రెల కాపలాదారులు చూపించిన స్థలంలో చిరుతపులి కాలి ముద్రలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News December 27, 2025
మాంజా ఎందుకంత డేంజర్? దేనితో తయారు చేస్తారు?

కైట్స్ పోటీల్లో ప్రత్యర్థి పతంగి దారాన్ని కట్ చేయడానికి చైనా మాంజాను షార్ప్‌గా తయారు చేస్తారు. కాటన్ లేదా సింథటిక్ దారానికి కృత్రిమ జిగురు, రంగులు, గ్లాస్ పౌడర్, మెటల్ పౌడర్ కలిపిన పేస్ట్‌ను పూస్తారు. దీన్ని ఎండలో ఆరబెట్టడం వల్ల దారం షార్ప్‌గా మారుతుంది. ఇది మనుషులు, పక్షులకు తీవ్ర ముప్పు తెస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో దీన్ని బ్యాన్ చేశారు.
News December 27, 2025
సిరిసిల్ల: ఉపాధి కూలి పెంపు ప్రకటనపై పెరుగుతున్న ఆశలు

జీ రామ్ జీ ఉపాధి హామీ పథకం కింద దినసరి కూలి పెంచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతుండడం ఉపాధి కూలీలలో ఆశలను పెంచుతోంది. ఏటా 100 పని దినాలను 125 రోజులకు పెంచిన నేపథ్యంలో దినసరి కూలిని రూ.270ల నుంచి రూ.325ల వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. కూలి పెంపుపై ఇంకా తుది ప్రకటన వెలువడనప్పటికీ, పెంచే ఆస్కారం కనిపించడం కూలీలలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.


