News July 24, 2024
ప.గో: ముద్రా రుణాల పెంపు.. కలలు సాకారమయ్యేనా?

ఉమ్మడి ప.గో జిల్లాలో 425 పరిశ్రమలు ఉన్నాయి. వాటిలో దాదాపు 100 పరిశ్రమల వరకు మూతపడ్డాయి. ఇలాంటి క్రమంలో కేంద్రం చిన్న పరిశ్రమలను ఆదుకునేలా బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ముద్రా రుణాల పరిమితి రూ.10 లక్షలు ఉండగా ఈ బడ్జెట్‌లో రూ.20 లక్షలకు పెంచారు. ఈ ముద్రా లోన్ ద్వారా యువత కలలు సాకారం కానున్నాయి. అర్హులు రుణం పొందేలా బ్యాంకుల్లో ఆంక్షలను సడలించారు.
Similar News
News September 16, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.
News September 15, 2025
స్కూల్ గేమ్స్ రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్-14, అండర్-17 రైఫిల్ షూటింగ్, ఆర్చరీ జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు సునీత, పీఎస్ఎన్ మల్లేశ్వరరావు సోమవారం తెలిపారు. 16న చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హై స్కూల్ భీమవరం వద్ద రైఫిల్ షూటింగ్ ఎంపిక ఉంటుందన్నారు. 17న వోల్గాస్ అకాడమీలో ఆర్చరీ జట్లు ఎంపిక ఉంటుందన్నారు. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అర్హులన్నారు.
News September 15, 2025
ఆకివీడు తహశీల్దార్ నియామకంలో గందరగోళం!

ఆకివీడు రెవెన్యూ కార్యాలయంలో బదిలీల గందరగోళం ఏర్పడింది. తహశీల్దార్ వెంకటేశ్వరరావును కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో ముందుగా ఆచంట డిప్యూటీ తహశీల్దార్ సోమేశ్వరరావును ఇన్‌ఛార్జ్ తహశీల్దార్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. అదే రోజు మళ్ళీ ఆదేశాలను రద్దు చేసి ఆకివీడు DT ఫరూక్‌కు బాధ్యతలిచ్చారు. MLA ఆదేశాలతోనే తొలుత ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేశారంటూ YCP శ్రేణులు ఆర్డర్ కాపీలను ట్రోల్ చేస్తున్నాయి.