News June 22, 2024
ప.గో.: యాక్సిడెంట్.. పరీక్షకు వెళ్తుండగా మహిళ మృతి

పెనుమంట్ర మండలం నెగ్గిపూడి పరిధిలోని చించినాడ కాలువ కల్వర్టు వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఉండ్రాజవరం మండలం వేలివెన్నుకు చెందిన గీతావాణి(23) పెనుగొండలో MBA చదువుతోంది. ఈమెకు రెండేళ్ల క్రితమే వివాహం కాగా.. పరీక్షల కోసం వారం క్రితం పుట్టిల్లు మార్టేరులోని శివరావుపేటకు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు బైక్‌పై వెళ్తుండగా లారీని ఢీ కొని చనిపోయింది.
Similar News
News July 5, 2025
ఆచంట: గోదారమ్మకు చేరుతున్న వరద నీరు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటు పెరుగుతోంది. ఆచంట మండలంలో కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలాపురం పుష్కర ఘాట్ల వద్దకు వరద నీరు చేరింది. పోలవరం వద్ద గోదావరికి వరద నీరు భారీగా చేరుకోవడంతో మరో రెండు, మూడు రోజుల్లో మరింత వరద ప్రవాహం ఉండొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
News July 5, 2025
మొగల్తూరు: చేపకు మనిషి లాంటి దంతాలు

మొగల్తూరు సుబ్రహ్మణ్యేశ్వం రోడ్లో ఒక రైతుకు చెందిన చేపల చెరువులో రూపు చందు చేపల్లో ఒక చేప వింత పోలికలతో కనిపించింది. మనిషిని పోలిన దవడ పళ్లు ఉన్న చేప దొరికింది. ఇది హర్యానా జాతికి చెందిన చేపని మత్స్యకారులు అంటున్నారు. చేపల పెంపకం దారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వేళ్లను కొరికే ప్రమాదం ఉంటుందంటున్నారు.
News July 5, 2025
పారిశుద్ధ్యం పనులపై జేసీ అసహనం

భీమవరం పట్టణంలో చెత్త నిర్మూలనకు ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశుద్ధ్యానికి తీసుకోవలసిన చర్యలపై భీమవరం ఆర్డీవో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. పారిశుద్ధ్యం మెరుగుదలకు ఎన్ని చర్యలు చేపట్టినా నామ్ కే వాస్తే అనే చందంగా ఉందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.