News March 28, 2025
ప.గో: రెండు రోజులు జాగ్రత్త

రానున్న రెండు రోజులు ప.గో జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెంలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పెంటపాడు, తణుకులో 40.6, అత్తిలి, ఆకివీడులో 40.1, ఇరగవరంలో 39.8, ఉండిలో 39.6, పెనుమంట్రలో 39.3, పెనుగొండలో 39.2, పాలకోడేరులో 39.1 డిగ్రీల ఎండ కాస్తుంది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. టోపీ, గొడుగు వాడాలి.
Similar News
News March 31, 2025
కాళ్ల: కోడి పందేలు ఆడుతున్న ముగ్గురు అరెస్ట్

కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ ఆదివారం తెలిపారు. ఎస్ఐ ఎన్.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కాళ్ల గ్రామంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద రూ.6,100 నగదు, కోడిపుంజు, కోడి కత్తి స్వాధీనం చేసుకున్నామన్నారు.
News March 30, 2025
జైలులో మహిళా ఖైదీ సూసైడ్

ఏలూరు జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న శాంతికుమారి అనే మహిళా ఖైదీ బ్యారక్‌లో చున్నితో ఆత్మహత్య చేసుకుంది. ఆమెను చూసిన జైలు సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. శాంతి కుమారిది జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఆరోపణలతో ఈనెల 24న అరెస్ట్ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 30, 2025
భీమవరం: రేపు పీజీఆర్ కార్యక్రమం రద్దు

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసిట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 31న రంజాన్ పండుగ కారణంగా రద్దు చేశామన్నారు. కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలోనూ జరిగే కార్యక్రమాన్ని కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించాలని కోరారు