News April 24, 2024

ప.గో.: రేపు నరసాపురం కూటమి అభ్యర్థి నామినేషన్ 

image

నర్సాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రేపు నామినేషన్ వేయనున్నారు. ఉదయం పెద అమిరంలోని NTR విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ చేరుకొని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందిస్తారని కూటమి నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.

Similar News

News April 21, 2025

అనకాపల్లి: బాబోయ్ అడ్మిషన్‌లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్!

image

అనకాపల్లి జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్‌లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?

News April 21, 2025

ఉమ్మడి ప.గో జిల్లాలో డీఎస్సీ పోస్టుల కేటాయింపు ఇలా..

image

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి ప.గో జిల్లాలో 1035 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
➣OC-421, ➣BC-A: 75, ➣BC-B: 102, ➣BC-C:10, ➣BC-D:68, ➣BC-E: 39, ➣SC గ్రేడ్1- 20, ➣SC గ్రేడ్2- 64, ➣SC గ్రేడ్3- 77, ➣ST- 61, ➣EWS- 98 పోస్టులు కేటాయించారు.

News April 21, 2025

పెంటపాడు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. కేసు నమోదు

image

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన పెంటపాడు(M) ఆలంపురం వద్ద ఆదివారం జరిగింది. మౌంజీపాడుకి చెందిన నిర్మల(42) తన కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా అలంపురం వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డు వచ్చింది. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడ్డారు. నిర్మల తలకు బలమైన గాయం తగలడంతో తణుకు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!