News April 8, 2025
ప.గో: రొయ్యకు రెస్ట్.. రైతుల నిర్ణయం

రొయ్యల సాగుకు మద్దతు ధరలు లేకపోవడంపై పచ్చిమ గోదావరి జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జులై నుంచి 3 నెలల పాటు రొయ్య సాగుకు విరామం ప్రకటిస్తున్నట్లు ఉమ్మడి ప.గో జిల్లాలోని పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాలకు చెందిన రైతులు ప్రకటించారు. మేత నుంచి రొయ్యల మద్దతు ధరల వరకు తమకు అన్యాయం జరుగుతోందని, ప్రాసెసింగ్ ప్లాంట్ల నుంచి ప్రభుత్వం వరకు తమకు అండగా నిలవాలని ఆక్వా రైతులు డిమాండ్ చేశారు.
Similar News
News April 17, 2025
ప.గో: వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

తణుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ కళాశాల బాలురు, బాలికల వసతి గృహాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రూ. 18.5 లక్షలు, రూ. 8.31 లక్షలు, రూ.2.41 లక్షల వ్యయంతో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో మూడు వసతి గృహాలకు చేపట్టిన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.
News April 16, 2025
ప.గో: భీమవరం సబ్ డివిజన్‌కు ఏబీసీడీ అవార్డు

రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం రేపిన ఉండి మండలం యండగండిలో శవం పార్సెల్ కేసు విషయం తెలిసిందే. ఈకేసును చేధించిన భీమవరం సబ్ డివిజన్ పోలీసులకు ఏబీసీడీ ప్రథమ అవార్డు లభించింది. బుధవారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మిలు అవార్డును అందజేశారు. సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలిపారు.
News April 16, 2025
ప.గో: సమ్మర్ సెలవుల్లో ఈప్రాంతాలు చూసొద్దాం రండి..

వేసవి సెలవులకు టూర్ ప్లాన్ చేసుకునే వారికి ప.గోజిల్లా స్వాగతం పలుకుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రాలు, సముద్ర తీరాలు మనసులను కట్టిపడేస్తాయి. భీమవరం మావుళ్లమ్మ, పెనుగొండ వాసవీ ధాం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రం, నత్తా రామేశ్వరం, దువ్వ దానేశ్వరీ అమ్మవారు, కాళ్ల సీసలి సాయిబాబా మందిరం, పేరుపాలెం బీచ్ సందర్శించి ఆహ్లాదాన్ని పొందవచ్చు. మీరేమైనా టూర్ ప్లాన్ చేసుకున్నారా కామెంట్ చేయండి.