News December 16, 2025
ప.గో: విద్యార్థులూ అలర్ట్.. రేపే కౌనెల్సింగ్

తాడేపల్లిగూడెం(M) వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఈనెల 17, 18వ తేదీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సులలో ప్రవేశానికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 17న పీజీ, 18న పీహెచ్‌డీ కోర్సులకు మాన్యువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని, అర్జీదారులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.
Similar News
News December 18, 2025
RR: 3 ఫేజుల్లో.. ముగ్గురు లక్కీ సర్పంచ్‌లు

రంగారెడ్డి జిల్లాలో 3విడతల్లో లక్కీగా సర్పంచ్ పీఠం ముగ్గురిని వరించింది. 1st ఫేజ్‌లో కొందర్గు చిన్నఎల్కిచర్లలో ఇద్దరికి సమాన ఓట్లురాగా టాస్‌తో రాజు గెలిచారు. 2nd ఫేజ్‌లో చేవెళ్ల గుండాలలో నరాలు తెగే ఉత్కంఠలో ఒక్క ఓటుతో బుచ్చిరెడ్డి గెలిచారు. 3rd ఫేజ్‌లో యాచారం తులేఖుర్దులో ఇద్దరికి సమాన ఓట్లు రాగా ఉద్రిక్తతకు దారితీస్తుందని గమనించిన పోలీసులు పరిస్థితి అదుపుచేయగా రికౌంటింగ్‌లో రమేశ్ గెలుపొందారు.
News December 18, 2025
పల్నాడు: వైద్యుల నిర్లక్ష్యం.. ప్రాణం కోల్పోయిన గర్భిణీ

నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. రెంటచింతల మండలానికి చెందిన సాగరమ్మ (21) ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరగా, ఆపరేషన్ అనంతరం వైద్యులు ‘O పాజిటివ్’ బదులు ‘A పాజిటివ్’ రక్తం ఎక్కించినట్లు సమాచారం. దీంతో ఆమె పరిస్థితి విషమించి మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది. రక్తం గ్రూపు మార్చి ఎక్కించడం వల్లే మృతి చెందిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News December 18, 2025
పొగచూరిన ఢిల్లీ.. విమానాలు, రైళ్లు ఆలస్యం

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన 40 విమానాలు ఆలస్యమయ్యాయి. అటు ఫాగ్ వల్ల 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలేవీ కనిపించడంలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న లక్నోలో పొగ మంచు వల్ల భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.


