News March 12, 2026
ప.గో: వేసవి హెచ్చరిక..

రానున్న వేసవి దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ గీతాబాయి సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బయటకు వెళ్లరాదని కోరారు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలని, తరచుగా మంచి నీరు, కొబ్బరిబొండాలు సేవించాలని హితవు పలికారు. ఎండలో ప్రయాణించేటప్పుడు టోపీలు ధరించాలని ఆమె పేర్కొన్నారు.
Similar News
News April 8, 2026
ప.గో: గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నరసాపురం మాధవాయిపాలెం సమీపంలోని గోదావరి నదిలో సుమారు 30 ఏళ్ల వయస్సున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. తుమ్మచెట్టు ప్రాంతంలో మృతదేహం నదిలో నీటిపై తేలుతుండటాన్ని గమనించిన వీఆర్వో కొప్పినీడి వెంకట సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
News April 8, 2026
ప.గో: రేషన్ షాపుల్లో కందిపప్పు కరవు: సామాన్యుల అవస్థలు

జిల్లాలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో తెల్ల కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ షాపులో రూ.67లకే లభించే కిలో కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో రూ.140కి పైగా పలుకుతోంది. అధిక ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే కోటా ప్రకారం కందిపప్పును సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సరఫరా పునరుద్ధరణ కోసం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు.