News November 18, 2024

ప.గో: వైసీపీకి వరుస షాక్‌లు.. జనసేనలోకి పలువురు నేతలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పలువురు YCP నేతలు కూటమి వైపు అడుగులు వేస్తున్నారు. ఆదివారం మంత్రి దుర్గేశ్ సమక్షంలో నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ ఆదినారాయణ, వైస్‌ చైర్‌పర్సన్ వెంకటలక్ష్మితోపాటు ఏడుగురు కౌన్సెలర్లు జనసేనలో చేరారు. వారిలో షాకీరా బేగం, మాణిక్యమాల, జాన్ బాబు, శారదాదేవి తదితరులు ఉన్నారు. నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో పలువురు సర్పంచ్‌లు మంత్రి నిమ్మల సమక్షంలో TDPలో చేరిన విషయం తెలిసిందే.

Similar News

News February 28, 2026

భీమవరం: ఆహార భద్రతపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆహార భద్రత, పశుసంవర్ధక శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. గత రెండ్రోజులుగా జరుగుతున్న తనిఖీల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.. పాలు, నెయ్యి, వెన్న వంటి పదార్థాల్లో కల్తీని గుర్తించే విధానం, నమూనాల ల్యాబ్ పరీక్షలపై దిశానిర్దేశం చేశారు.

News February 27, 2026

కలెక్టరుకు చాక్‌పీస్‌ మైక్రోఆర్ట్‌ బహూకరణ

image

పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్‌పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్‌లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు. తన పేరును ఇంత సూక్ష్మంగా, కళాత్మకంగా చెక్కడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.