News November 13, 2025

ప.గో: వైసీపీలో ఆరుగురికి కీలక పదవులు

image

వైసీపీ రాష్ట్ర కార్యవర్గంలో పలువురిని కార్యదర్శులుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. పేరిచర్ల విజయ నరసింహారాజు, ముప్పిడి సంపత్ కుమార్, యడ్ల తాతాజీ, కొట్టు నాగేంద్ర (పశ్చిమగోదావరి ), నూకపెయ్యి సుధీర్ బాబు, డీ వీ ఆర్ కే. చౌదరి (ఏలూరు) నియమితులయ్యారు.

Similar News

News November 13, 2025

భీమేశ్వరాలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో 22వ రోజు కార్తీక దీపోత్సవం ఘనంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ఆలయ అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుహాసినులకు వాయినంగా పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి ఫొటోను అందజేశారు.

News November 13, 2025

టెర్రర్ మాడ్యూల్.. మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు

image

ఉగ్ర లింకుల నేపథ్యంలో హైదరాబాద్‌లో గుజరాత్ ATS సోదాలు నిర్వహించింది. రాజేంద్రనగర్‌లోని డా.మొహియుద్దీన్ నివాసంలో తనిఖీలు చేసి 3 రకాల లిక్విడ్‌లను స్వాధీనం చేసుకుంది. ఆయిల్ మెషీన్‌తో పాటు కొన్ని పుస్తకాలు సీజ్ చేసింది. జైషే మహ్మద్ సానుభూతిపరుడు మొహియుద్దీన్ ఆముదం గింజల వ్యర్థాల నుంచి రెసిన్ అనే విషాన్ని తయారుచేశాడు. దానితో వేలాది మందిని చంపాలని ప్లాన్ చేశాడు. ఈక్రమంలోనే ఇటీవల అతడిని అరెస్ట్ చేశారు.

News November 13, 2025

రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

తెలంగాణలో ఇవాళ తెల్లవారుజామున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌లోని సిర్పూర్‌లో కనిష్ఠంగా 7.1, తిర్యానీలో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇక HYD శివార్లలోని ఇబ్రహీంపట్నంలో 11.5, శేరిలింగంపల్లి(HCU)లో 11.8, రాజేంద్రనగర్‌లో 12.9, మారేడ్ పల్లిలో 13.6 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయినట్లు పేర్కొన్నారు. రాబోయే 4-5 రోజుల్లో చలిగాలులు మరింత పెరుగుతాయని హెచ్చరించారు.