News July 24, 2024

ప.గో: వ్యవసాయాభివృద్ధికి రూ.50 కోట్లు

image

కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వడంతో అన్నదాతలు ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి ప.గో జిల్లాలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. కేంద్రం బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్లతో కాలువల ఆధునికీకరణ, ఏటిగట్ల ప్రతిష్ట, రెగ్యులేటర్ల మరమ్మతు పనులను ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. అటు ప్రకృతి వ్యవసాయ రంగంలో యువతను భాగస్వామ్యం చేసేలా అడుగులు వేయనుంది.

Similar News

News February 19, 2026

నరసాపురం: బలవన్మరణానికి పాల్పడిన బాలిక

image

నరసాపురం పట్టణంలో బాలిక ఆత్మహత్య కలకలం రేపింది. పోలీసులు వివరాల మేరకు.. పట్టణానికి చెందిన ఓ బాలిక ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం కుటుంబీకులు ఆసుపత్రికి తరలించినా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి చెప్పారు. దీనిపై టౌన్ ఎస్ఐ జయలక్ష్మి కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2026

ఓటర్ల మ్యాపింగ్ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి బిఎల్ఓలను ఆదేశించారు. బుధవారం భీమవరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల నమోదు, మార్పుల క్లైమ్ల పరిష్కారంపై సమీక్షించారు. ముఖ్యంగా యువ ఓటర్ల నమోదుపై ప్రత్యేక ప్రచారం చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 18, 2026

పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగే పది, ఇంటర్ పరీక్షలపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సమీక్షించారు. జిల్లాలోని 132 కేంద్రాలలో 24,166 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.