News August 5, 2024
ప.గో.: సముద్రంలో యువకుడు గల్లంతు (UPDATE)

ప.గో. జిల్లా పేరుపాలెం బీచ్ వద్ద సముద్రంలో తణుకు పట్టణానికి ఇంటర్ విద్యార్థి కొల్లి జాన్‌బాబు (17) ఆదివారం మధ్యాహ్నం గల్లంతైన విషయం తెలిసిందే. కాగా యువకుడి ఆచూకీ కోసం పోలీసులు ఆదివారం రాత్రి వరకు గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే సోమవారం (నేడు) తెల్లవారుజాము నుంచి మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News November 12, 2025
ఆకివీడు: డిప్యూటీ సీఎం చొరవతో నేడు గృహప్రవేశం

చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి ఇళ్లు లేక ఇబ్బంది పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ను గత మూడు నెలల క్రితం మంగళగిరిలో ఆమె పవన్‌ను కలిసి తన గోడును విన్నవించుకుంది. పవన్ ఆదేశాలతో ఇంటి నిర్మాణంలో భాగంగా, నేడు కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. సొంతింటి కల నెరవేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
News November 12, 2025
తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
News November 12, 2025
తాళ్లకోడు లేఔట్లో సామూహిక నూతన గృహప్రవేశాలు

ఆకివీడు మండలం కుప్పనపూడి శివారు తాళ్లకోడులోని 74 ఎకరాల లేఔట్లో NTR కాలనీలో సమూహిక నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. పలువురి లబ్ధిదారులకు నూతన గృహ రుణ పత్రాలు అందించారు. కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట సర్పంచ్ అనురాధ ఉన్నారు.


