News May 24, 2024
ప.గో.: సరిగ్గా 11 రోజులు.. ఉత్కంఠ

ఎన్నికల ఫలితాలకు సరిగ్గా నేటి నుంచి 11 రోజులు ఉంది. ఒక్కోరోజు గడుస్తున్నా కొద్దీ అభ్యర్థులు సహా.. పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఎక్కడ చూసినా ఫలితాలపైనే చర్చ జరుగుతోంది. పలుచోట్ల ఎవరికి వారు గెలుపుపై అంచనాలు వేస్తూ బెట్టింగులు వేస్తున్నారు. మరి మన ప.గో. జిల్లాలోని 15 స్థానాల్లో ఎవరు గెలుస్తారో చూడాలి. మరోవైపు అధికార యంత్రాంగం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద నిరంతరం భద్రత చర్యలు తీసుకుంటోంది.
Similar News
News November 8, 2025
నరసాపురం: ఉరి వేసుకుని వ్యక్తి మృతి

నరసాపురం(M) సీతారామపురంలోని 216 జాతీయ రహదారి బ్రిడ్జి వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడిని సీతారామపురం నార్త్ గ్రామానికి చెందిన వాకా సత్యనారాయణ (72)గా గుర్తించారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 8, 2025
భీమవరం: బ్యాంకుల అధికారులపై కలెక్టర్ అసహనం

పీఎం స్వనిధి, వీవర్స్ ముద్ర, ఎస్‌హెచ్‌సి గ్రూపులకు బ్యాంకర్లు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. శుక్రవారం భీమవరం క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్యాంకర్లు, అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎం స్వనిధి కింద నిధులు విడుదలలో కొన్ని బ్యాంకులు తాత్సారం చేయడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేస్తూ, వేగవంతంగా రుణాలు అందించాలని సూచించారు.
News November 7, 2025
ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలి: కలెక్టర్

జిల్లాలోని ఆక్వా రైతుల అభివృద్ధికి సహకారం అందించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ నీతు కుమారి మత్స్య శాఖపై జిల్లా కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ నాగరాణి, జాయింట్ సెక్రటరీ నీతు కుమారితో పలు కీలక అంశాలను తెలియజేశారు.


