News March 27, 2024
ప.గో.: సీ-విజిల్‌లో ఫిర్యాదులు.. దెందులూరులో అధికం

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సీ-విజిల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. కాగా ఇప్పటివరకు ప.గో. జిల్లాలో 64 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా దెందులూరు నియోజకవర్గంలో 17, ఏలూరులో 5, కైకలూరులో 8, నూజివీడులో 11, పోలవరంలో 13, ఉంగుటూరులో 10 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులన్నింటినీ అధికారులు పరిష్కరించారు. యాప్‌ను ప్రజలు ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News February 11, 2026
నరసాపురం: తీరంలో అలివ్ రిడ్లే తాబేళ్ల మృత్యువాత

నరసాపురం, మొగల్తూరు సముద్ర తీర ప్రాంతాల్లో అరుదైన అలివ్ రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి తీరానికి వచ్చే ఈ తాబేళ్లు.. ఈ ఏడాది వరుసగా ప్రాణాలు కోల్పోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు, మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాబేళ్లు మృతి చెంది ఒడ్డుకు కొట్టుకురావడంతో తీరం వెంబడి దుర్వాసన వెదజల్లుతోంది.
News February 10, 2026
ప.గో: ఫైళ్ల నిర్వహణ ఇక ఈ-ఆఫీస్ ద్వారానే

ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ఇకపై ప్రతి ఫైలు ఈ-ఆఫీస్ ద్వారానే పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులకు నిర్వహించిన గూగుల్ మీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ విధిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, ఉద్యోగులందరూ ఈ సాంకేతికతపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.
News February 10, 2026
ప.గో: ట్రంప్ టారిఫ్ తగ్గించినా.. ‘సిండికేట్’ వదలడం లేదు (2/3)

ఉమ్మడి ప.గో. జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇటీవల ట్రంప్ ఎగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గించడంతో మేలు జరుగుతుందని రైతులు భావించారు. అయితే సిండికేట్ వ్యాపారుల వల్ల రైతులకు ఫలితం దక్కడం లేదు. మేతలు, విత్తనాల ధరలు పెంచి ట్రేడర్లు లాభాలను కొల్లగొడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, సిండికేట్ల దోపిడీ నుంచి విముక్తి కలిగించాలని రైతులు కోరుతున్నారు.


