News September 16, 2025
ప.గో: 13 మంది ఉద్యోగులకు పదోన్నతి

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌లో ఏఓలు, డిప్యూటీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్న 13 మంది ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తమ శ్రమను గుర్తించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Similar News
News September 16, 2025
గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రజలకు ALLERT

భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్ట్ వరద గేట్ల నుంచి నీటిని ఏ క్షణమైన విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. నదీ పరివాహక ప్రాంతంలోకి (దిగువకు) పశువులు, గొర్రెలు వెళ్లకుండా రైతులు, గొర్రెకాపరులు జాగ్రత్త వహించాలన్నారు. తగిన సూచనలు చేసే వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News September 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 16, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 16, 2025
VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు వరం

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను ఆయన కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని సూచించారు.